Home  »  TV News  »  Karthika Deepam2: జ్యోత్స్నపై చేయి చేసుకున్న పారిజాతం.. దీప కోసం మనవరాలిని కొట్టిందా?

Updated : Apr 2, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2 (Karthika Deepam2)'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్-633 లో.. జ్యోత్స్న వాళ్ళ వాళ్ళతో కూడా మాటలు పడాల్సి వస్తుంది. కాస్తైనా వెనకా ముందు ఆలోచించదు. ఆ తర్వాత ఇంటికి వచ్చి క్షమాపణలు చెప్తారని కాంచన అంటుంది. మీ మేనకోడలు క్షమాపణలు చెప్పే రకం కాదు చెల్లమ్మ.. వీలునామా గురించి గొడవ అయిందన్నారు కదా మళ్ళీ దాని గురించి పంచాయితీ పెట్టినట్టుంది.. పంచాయతీ అంటే మీరు రారు కదా అందుకే పార్టీ అంటుందని అనసూయ అంటుంది.  అలాంటిదేం లేదులే పెద్దమ్మ అని కార్తీక్ అంటాడు. ఇక కాంచన కాంప్రమైజ్ అయి వెళ్దామని అంటుంది. పారిజాతం ఇంటికి వచ్చి క్షమాపణలు చెప్పింది. జ్యోత్స్న లో కూడా మార్పు వచ్చిందేమో.. చూద్దామని కాంచన అంటుంది.

మరోవైపు కావేరీతో కాశీ మాట్లాడుతుంటాడు. స్వప్నని మారుద్దామని అనుకున్నాను.. నాకు నువ్వు కావాలని చెప్పగలుగుతున్నాను కానీ తను కూడా అలా ఆలోచించాలి లదా అత్తయ్య అందుకోసమే ఎదురుచూస్తున్నాని చెప్పేసి కాశీ వెళ్తుండగా అప్పుడే స్వప్న వచ్చి పిలుస్తుంది. రేపు పొద్దున్నే గుడికి వెళ్దామని అంటుంది. దాంతో స్వప్న మనసు మార్చుకుందేమోనని కావేరీ, శ్రీధర్, దాస్ అంతా ఆనందపడతారు. కానీ కొత్త పెళ్ళికొడుకు గుడికి వెళ్దామని అన్నాడు.. మేమిద్దరం వెళ్తున్నామని స్వప్న అనగానే అందరు షాక్ అవుతారు. అదేంటే అని కావేరీ అడుగగా.. అతను పెళ్ళికి ముందే ఒకరికొకరు అర్థం చేసుకోవాలని అన్నాడు‌‌.. అందుకే వెళ్తున్నానని స్వప్న అనగానే అలాగే మేడమ్ అని కాశీ అంటాడు. దాంతో స్వప్న వెళ్ళిపోతుంది. ఏం చేస్తున్నావ్ కాశీ అని కావేరి అడుగుతుంది. తను నన్ను అర్థం చేసుకో లేకపోయినా.. ‌తనకి తోడుగా అయినా ఉంటాను.. ఆడవాళ్ళకి ఈ మధ్య సెక్యూరిటీ లేకుండా పోయిందని చెప్పి కాశీ  వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు కాంచన, కార్తీక్, దీప, శౌర్య కలిసి శివన్నారాయణ ఇంటికి వస్తారు.

దీప రాగానే మనవరాలా అంటూ పారిజాతం హగ్ చేసుకుంటుంది. మెడ ఏంటి బోసిగా ఉంది నా నెక్లెస్ వేసుకోమని పారిజాతం అనగానే వద్దు పారిజాతం గారు అని దీప అనగానే ఇంకా పేరేంటి..నాన్నమ్మ అని పిలువు అని పారిజాతం అంటుంది. సరేనని దీప అంటుంది.‌ ఇక అందరు ఇంటిలోకి వెళ్తారు. అక్కడ శ్రీధర్ డిస్సప్పాయింట్ మాట్లాడుతుంటే శివన్నారాయణ సర్దిచెప్తాడు. అన్నీ మర్చిపోయి సంతోషంగా ఉండండి అని జ్యోత్స్న అనగానే సరేనని అందరు మాములుగా ఉంటారు. ఇక శౌర్య కిచెన్ లోకి పరుగెడుతుండగా జ్యోత్స్నకి తగిలి పడిపోతుంది. వెంటనే పారిజాతం వచ్చి జ్యోత్స్నని తిడతుంది. అదేంటి తను తగిలి పడిపోతే నన్ను ఎందుకు అంటావని జ్యోత్స్న అంటుంది. ముందు శౌర్యకి క్షమాపణ చెప్పమని పారిజాతం అడుగగా నేను చెప్పనని జ్యోత్స్న అంటుంది. దాంతో జ్యోత్స్న చెంపచెల్లుమనిపిస్తుంది పారిజాతం. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.